South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 12 రైల్వేస్టేషన్లలో తక్కువ ధరలో ఎకానమీ మీల్స్..
South Central Railway Economy Meals | రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్నిఅందించేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ భోజనాలు ప్లాట్‌ఫారమ్‌లపై సాధారణ కోచ్‌ల వద్ద అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి "ఎకానమీ మీల్స్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి తక్కువ ధరలో రెండు రకాల భోజనాలు అందిస్తోంది. ఈ భోజన కౌంటర్లు ఇప్పుడు భారతీయ రైల్వేలలో 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్లలో పనిచేస్తున్నాయి.
కొత్తగా చేర్చిన స్టేషన్లు ఇవే..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా 12 స్టేషన్లలో ఎకానమీ మీల్స్ అందించడం ప్రార...