Fish Hunger Strike | నిరాహార దీక్ష చేసిన చేప.. దీని డిమాండ్ ఏమిటో తెలుసా?
Fish Hunger Strike | కొంతకాలంగా ఓ చేప వార్తల్లో తరచూ వినిపిస్తోంది. జాపాన్(Japan) లోని భారీ ఎక్వేరియంలో ఉంటున్న సన్ ఫిష్.. కొన్నాళ్లుగా తనకు పెట్టిన ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహారదీక్ష చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని గల కారణమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇది అకస్మాత్తుగా తినడం మానేసింది. ఈ చేప ప్రపంచంలోనే ఒంటరి చేప అనే బిరుదు (World loneliest fish) కూడా పొందింది. అయితే జపనీస్ అక్వేరియంలోని ఈ చేప డిప్రెషన్‌లోకి వెళ్లిందని అక్కడి ప్రజలు అంటున్నారు. అందుకే తినడం మానేసిందని భావించారు. చాలా కాలం వరకు వారికి దీనికి కారణం అర్థం కాలేదు.
Fish Hunger Strike : కారణం ఏమిటో తెలిసింది
దక్షిణ జపాన్‌లోని షిమోనోసెకిలోని కైక్యోకాన్ అక్వేరియం డిసెంబర్ 2024లో పునర్నిర్మాణం కోసం మూసివేయబడింది. చాలా చేపలు దీనిని విరామంగా తీసుకున్నప్పటికీ, తినడం మరియు త్రాగడం కొనసాగించినప్పటికీ, ...