Monday, April 21Welcome to Vandebhaarath

Tag: Farmers

రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?
National

రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?

KISAN Samman Nidhi 18th Instalment | న్యూఢిల్లీ: పీఎం కిసాన్ నిధి పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ఇది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి 3 సార్లు రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో 18వ విడతలో 20 వేల కోట్ల రూపాయలను పీఎం మోదీ విడుదల చేశారు. దీనివల్ల సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది రైతులకు ల‌బ్ధి చేకూరుతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రాంట్లు, ఆర్థిక సహాయం తదితరాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇంతకుముందు, పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు నాలుగు నెలల వ్యవధిలో రూ.2000 చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం అందించారు. ఈ పీఎం కిసాన్ పథకం గత ఫిబ్రవరి 2019 ...
National

Agricultural Projects | రైతుల‌కు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం

Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీల‌క‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివరించారు. ఆహార, పోషకాహార భద్రత కోసం క్రాప్ సైన్స్: రూ. 3,979 కోట్లు ఆహారం, పోషకాహార భద్రత కోసం crop science కోసం ప్రభుత్వం రూ.3,979 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఐదు రంగాలపై దృష్టి పెడుతుంది: పరిశోధన - విద్య: వ్యవసాయంలో విద్యా, పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం. మొక్కల జన్యు వనరుల నిర్వహణ: పంట అభివృద్ధి కోసం జన్యు వనరులను పరిరక్షించడం, ఉపయోగించడం. ఆహారం, పశుగ్రాసం పంటలకు జన్యుపరమైన మెరుగుదల: పప్పుధాన్యాలు, నూన...
National, Telangana

Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న‌ రుణాలకు కటాఫ్‌ డేట్‌..

Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న‌ రుణాన్ని చెల్లించిన తర్వాతే మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేదానిలో వాస్త‌వం లేద‌ని స్పష్టంచేశారు. ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ (Runa Mafi) చేసిన‌ట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెల‌, లేదా రెండు నెలల్లో కటాఫ్‌ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ...
Business

PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2 వేల రూపాయలు డబ్బులు ప్రతిసారి అకౌంట్ లో జమ అవుతాయి.ఈ పథకం కోసం ఇప్పటికే 17వ విడత డబ్బులను లబ్ధిదారులు అందుకున్నారు. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బులను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18న అందరి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత విడుదల చేయాల్సిన 2 వేల గురించి అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 18వ విడత పీఎం కిసాన్ యోజన రూ.2,000 నగదు ఆగస్ట్  నెలలో రాఖీపౌర్ణమి పండుగ తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  18వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ను సులభంగానే మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే.. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాల...
Telangana

Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

Telangana: రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీ ప‌థ‌కాన్ని(Raitu RunaMafi) ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు ప్రారంభించింది. మొదటి విడతలో రూ. లక్ష వ‌ర‌కు ఉన్న రుణాలు మాఫీ చేసి చూపింది. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగస్టు 15 నాటికి మొత్తం రెండు లక్షల రూపాయ‌ల వ‌ర‌కు గ‌ల‌ రుణాల‌ను రైతుల తరఫున ప్రభుత్వం (Congress Government) బ్యాంకుల్లో జ‌మ చేసేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల‌ను విడుదల చేశారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేయ‌డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒకేసారి రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంపై బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం మండిప‌డింది. రేపే రెండో విడుత రుణ మాఫీ Second Phase Raitu RunaMafi : కాగా, ఇప్పటికే రూ.లక్ష వ‌ర‌కు ఉన్న‌ రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్.. రెండో విడత రుణమాఫీకి అం...
Telangana

Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం

Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత‌ బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్ల‌డించారు. రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవే...
Telangana

Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభ‌వార్త‌.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్‌ ‌కార్డు ఆధారంగా..

Rythu Runa-Mafi Guidelines | హైదరాబాద్: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించ‌నున్నారు. రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.. 12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలను మాఫీ చేయ‌నున్నారు. 2023 డిసెంబర్ 09 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర...
Telangana

Rythu runa Mafi | రైతుల‌కు శుభ‌వార్త‌.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు..

Rythu runa Mafi | రుణ మాఫీ కోసం ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. దీంతో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. అయితే ఇటీవ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ‌స్టు 15 లోపు రుణ‌మాఫీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా ఉప‌ముఖ్య‌మ‌త్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti Vikramarka ) రుణ‌మాఫీ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ 2 లక్షల రైతు రుణమాఫీ (Rythu runa Mafi )  ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామని ఈ ప‌థ‌కాన్ని ఎవరూ అడ్డుకోలేర‌ని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా అమ‌లుపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని రైతు భ‌రోసా ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి? అన్నది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామ‌ని, విధివిధానాల...
National

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది. #Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25 The highest absolute increase in MSP over the previous year has been recommended for oilseeds and pulses#CabinetDecisions pic.twitter.com/zhqhXyNzut — Sheyphali ...
Business, National

PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ విడ‌త నిధుల‌ను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బ‌దిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. కాగా  ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున‌ సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతలు విడుదల చేసింది. ''రైతు సం...
Exit mobile version