Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!
Exit Polls 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అంచనాలను వెల్లడించాయి . ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. కొన్ని పోల్స్ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గట్టి పోటీ ఇస్తుందని వెల్లడించాయి. అదే సమయంలో, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితంకావొచ్చని తేల్చి చెప్పాయి. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో గె...