Italy | యూరప్ వలస వాదంపై నిప్పులు చెరిగిన ఇటలీ ప్రధాని..
Italy | వలస సంక్షోభంపై యూరప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ వైరల్ వీడియోలో, మెలోని ఇటలీ "యూరప్ శరణార్థి శిబిరం ప్రమాదంగా మారుతోందని, లిబియాలో నావికా దిగ్బంధనం చేయడంతోపటు NGO రెస్క్యూ షిప్‌లను సముద్రంలో ముంచేయాలని పిలుపునిచ్చింది. "మేము యూరప్ శరణార్థుల శిబిరంగా మారే ప్రమాదం ఉంది, మాకు లిబియాలో నావికా దిగ్బంధనం అవసరం, NGO నౌకలను ముంచడం ప్రారంభించాలి" అని ఇటాలియన్ PM ఆవేశపూరితంగా అన్నారు.
అక్రమ వలసలకు వ్యతిరేకంగా మెలోని కఠిన వైఖరిని హైలైట్ చేస్తూ వీడియో వైరల్‌గా మారింది. ఆమె ప్రభుత్వం ఇటీవల 23వ సారి రెస్క్యూ షిప్ జియో బారెంట్స్‌ను స్వాధీనం చేసుకుంది. మధ్యధరా వలసలపై అణిచివేతను తీవ్రతరం చేసింది. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (MSF) ఆధ్యంలో నిర్వహిస్తున్న ఓడ 191 మంది వలసదారులను రక్షించిన తర్వ...