Telangana Cabinet | ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు.. మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం
Telangana Cabinet Decisions : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన చర్యలు, హైడ్రా, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరునాగాారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని తీర్మానించారు. అలాగే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్...