PM Internship Scheme 2025 : నెలకు రూ.5,000 స్టైఫండ్ అందించే పథకానికి తుది గడువు మరికొద్దిరోజులే..
PM Internship Scheme 2025 : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) పైలట్ దశ - 2 కోసం దరఖాస్తులను ప్రారంభించింది. ఈ గడువు వచ్చే వారం ముగిసిపోతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) అధికారిక పోర్టల్, pminternship.mca.gov.in ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ మార్చి 12, 2025.
PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం
పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనిని అక్టోబర్ 3, 2024న ప్రారంభించారు. ఇప్పటివరకు, ఈ పథకం 28,141 మంది అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించిందని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. ఇంటర్న్‌షిప్...