Tuesday, March 4Thank you for visiting

Tag: Elections 2023

BJP | తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగాయి.. షాకిచ్చిన అగ్రనేతల ఓటమి

Telangana
Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని ఫలితాలు వచ్చాయి. పార్టీకి ప్రధాన బలంగా భావించిన అగ్రనేతలు ఓటమి పాలు కావడం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలుస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారు మాత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి 8 స్థానాలు ప్రజలకు కట్టబెట్టిన కీలకమైన అగ్రనేతలను నేతలు ఓడిపోవడం మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. బండి సంజయ్‌ ఓటమి పెద్ద షాక్.. తెలంగాణ మొత్తం బీజేపీకి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి నేతగా బండి సంజయ్‌కి పేరుంది. పార్టీ అధ్యక్షుడిగా పార్టీని అగ్రపథాన నిలబెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. తెలంగాణలో బలమైన బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన్ని అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ...

Elections 2023: 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి … ప్రతీసారి డిపాజిట్ దక్కలేదు.. మళ్లీ ఈసారి…

Trending News
madhya pradesh Elections 2023: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చెందిన ప్రమానంద్ తోలానీ గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి ఆయన్ను ఏనాడూ వరించలేదు.. ఏకంగా 18 సార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన 63ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారికి.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. కానీ ఎన్నిఓటములు వచ్చినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు. తాజాగా రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమానంద్ తోలానీ నామినేషన్ దాఖలు చేశారు.. వరుస ఓటములు అతనికి "ఇండోరి ధరి పకడ్" బిరుదును సంపాదించిపెట్టింది. ‘ప్రజలు చాలా తెలివైన వారు..’ నవంబర్ 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (madhya pradesh Elections 2023:) ఇండోర్-4 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రమానంద్ తోలని తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, అతను ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. "ఇ...

 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

National
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ‌తోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు నవంబరు 15 చివరి తేదీ. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 35,356 పోలి...

ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి 

Local
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వరంగల్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని వరంగల్ జిల్లా పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హా లో రిటర్నింగ్ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, వర్ధన్నపేటకు సంబంధించి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీవో క్రిష్ణవేణి రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ బాధ్యతల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులకు వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, విధి విధానాలపై కలెక్టర్ వివిధ అంశాల వారీగా వివరించారు. జిల్లాలో ఎన్నికల విధుల ని...
Exit mobile version