Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: election commission

Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం..  నేడే షెడ్యూల్ విడుదల
Elections

Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. నేడే షెడ్యూల్ విడుదల

Maharashtra and Jharkhand Assembly Elections | భారత ఎన్నికల సంఘం (Election Commission) ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూత్ తోపాటు కేరళలోని వాయనాడ్‌తో సహా మూడు లోక్‌సభలకు, వివిధ‌ రాష్ట్రాలలో కనీసం 47 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. . కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఈ వేసవి లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి గెలుపొంద‌గా, కేర‌ళ‌ వయనాడ్ స్థానాన్నివ‌దులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎంపీగా కొన‌సాగుతున్నారు. అలాగే నాందేడ్ (మహారాష్ట్ర), బసిర్హట్ (పశ్చిమ బెంగాల్) రెండు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 26, జనవరి 5న అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ...
Elections

Assembly Elections | మోగిన ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఎన్నికలు

Assembly Elections | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం ప్రకటించింది. ఇది 2014 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ఎన్నికలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడు దశల్లో ఎన్నికలు జ‌మ్మూక‌శ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి; సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబర్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది" అని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్ల వివరాలు..  జ‌మ్మూక‌శ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో 74 జనరల్, ఎస్టీలు 9, ఎస్సీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఇక‌ ఓటర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్...
Special Stories

Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది. అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024...
Andhrapradesh, Elections

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబ...
Elections

Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Lok Sabha Elections 2024 Voter Slip : దేశంలో సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగియ‌గా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 88 స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26, శుక్రవారం పోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి వారి ఓటరు ID కార్డులతో పాటు వారి ఓటరు స్లిప్పులను వెంట ఉంచుకోవాలి. ఓటర్ స్లిప్ (Voter Slip) అంటే ఏమిటి? ఓటర్ స్లిప్ అనేది తన ఓటు వేసేందుకు అర్హ‌తను నిర్ధారిస్తుంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఉన్న‌ట్లు చెప్పడానికి ఒక రకమైన రుజువు. ఓట‌ర్‌ స్లిప్‌లో ఓటరు పేరు, చిరునామా, ప్రాంతం, బూత్ సమాచారంతోపాటు ఇతర వివరాలతో సహా సమాచారం ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి ముందు వారి నియమించబడిన పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారికి స్లిప్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి ఓటరు స్లిప్‌లో పేర్కొన్న సమాచారాన్ని ఎలక్టోరల్ రోల్...
Elections

Special Polling Booths | ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్నమైన స్పెషల్, సఖి, ట్రైబల్ థీమ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలుసా.. ..

Special Polling Booths | లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నిక‌ల సంఘం వినూత్న‌మైన కార్య‌క‌మ్రాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా కర్నాటకలో 1800 స్పెష‌ల్‌ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌హిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,120 సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల‌ను పూర్తిగా మ‌హిళ‌లే నిర్వహిస్తారు. బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ప్ర‌జ‌లంద‌రూ ఉత్సాహంగా ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. గిరిజనులు, మహిళలు, దివ్యాంగుల‌ను ఓట్లపండుగ‌లో పాల్గొనేలా కర్ణాటకలో ఎన్నికల సంఘం (EC) 1,832 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ తెగల శాఖ ఈసీ సమన్వయంతో గిరిజన సంస్కృతి నేపథ్యం ఆధారంగా 40 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ...
Elections

Hyderabad Lok Sabha elections | హైదరాబాద్‌లో 5.41 లక్షల మంది న‌కిలీ ఓటర్లను తొల‌గించిన ఎన్నికల సంఘం

  Hyderabad Lok Sabha elections 2024: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ‌ల‌ ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీ ఓట్ల‌తో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మే 13న నాలుగో విడ‌ల‌తో ఓటింగ్ జరగనుంది. ఏఐఎంఐఎం కంచుకోటగా నిలిచిన హైదరాబాద్  లోక్ సభ స్థానంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా  హాట్ సీట్ గా నిలిచింది. . అయితే ఓట్ల తొలగింపుపై జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితా స్వచ్ఛతకు కృషిచేస్తోందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ECI నిబంధనలకు కట్టు...
National

Lok Sabha Election 2024 : 3వ దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12 రాష్ట్రాలు.. 94 సెగ్మెంట్లు..

Lok Sabha Election 2024 : మే 7న 12 రాష్ట్రాల్లోని 94 నియోజక వర్గాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12, 2024 శుక్రవారం ప్రారంభమైంది. మూడో ద‌శలో భాగంగా అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ - డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేష‌న్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19, 2024. నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 20. అభ్యర్థులు త‌మ నామినేష‌న్ల‌ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణ‌యించింది. 18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Lok Sabha Election 2024 : ఫేజ్ 3 షెడ్యూల్ ఇదే.. ప్రకటన & ప్రెస్ న...
National

Lok Sabha elections | లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..

Lok Sabha elections | లోక్ స‌భ తొలిద‌శ ఎన్నిక‌లకు సంబంధించి  నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏప్రిల్‌ 19న జ‌ర‌గ‌నుంది.ఈ నేప‌థ్యంలో  ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో నేటి నుంచే నామినేషన్‌ల ప్రక్రియ మొద‌లుకానుంది. బీహార్ మినహా మొద‌టి విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం క‌ల్పించారు. బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల‌ను స‌మ‌ర్పించేందుకు వెసులుబాటు ఇచ్చారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల‌ 28న నామినేషన్ల‌కు సంబంధించి స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్క్రూటినీ జరరుతుంది. బీహార్‌ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్‌ల విత్ డ్రా కు తుదిగడువు విధించారు. బీహార్‌లో మాత్రం నామినేషన్‌ల ...
National, Trending News

Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది...ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీకాలం కూడా జూన్‌తో ముగియనుంది. రానున్న ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది. "12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. అంటే ఇక్...
Exit mobile version