Aurangzeb : ఔరంగజేబ్‌ను పొడిగిడినందుకు సమాజ్ వాదీ పార్టీ నేతపై కేసు
అత్యంత క్రూరుడైన మొఘల్ పాలకుడు ఔరంగజేబును (Aurangzeb) ప్రశంసిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అబు అజ్మీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, శివసేన (షిండే వర్గం) ఆయనపై పోలీసు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అజ్మీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
శివసేన ఫిర్యాదు
శివసేన (షిండే వర్గం) అబూ అజ్మీపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి కిరణ్ పవాస్కర్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎస్పీ నాయకుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. అలాగే, శివసేన ఎంపీ నరేష్ మష్కే BNS సెక్షన్లు 299, 302, 356 (1), మరియు 356(2) కింద ప్రత్యేక...