Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..
Medchel : దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు.
మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి
మేడ్చల్ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్...