Friday, March 14Thank you for visiting

Tag: Dubai

Jobs in Dubai | దుబాయ్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగాలు .. భారీగా వేతనాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..

Career
Jobs in Dubai | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), దుబాయ్(Dubai ), యుఎఇ (UAE)లో డెలివరీ బాయ్స్ (Delivery Boy) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్య‌ర్థుల‌ నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17, గురువారం, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూకు హాజరు కావాల‌ని కోరింది. యుఎఇలోని దుబాయ్‌లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్)కి అధిక డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగస్తుల‌కు ఆకర్షణీయమైన వేత‌న ప్యాకేజీ అందిస్తాయి. సురక్షితమైన మరియు చట్టపరమైన వలసల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో TOMCOM అభ్యర్థులకు సహాయం చేస్తుందని TOMCOM ఒక పత్రికా ప్రకటన తెలిపింది. అయితే ఈ ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం SSC ఉత్తీర్ణులై ఉండాలి....

Dubai rains | ఎడారి దేశంలో ఆక‌స్మిక వ‌ర్షాలు, రోడ్ల‌పై మోకాళ్ల లోతు వ‌ర‌ద నీరు..

World
Dubai rains | మధ్యప్రాచ్య ఆర్థిక కేంద్రమైన దుబాయ్ ఇప్పుడు ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. భారీ వర్షాల కారణంగా UAE, బహ్రెయిన్ అంతటా వరద నీరు పోటెత్తుతోంది. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా రెండు రోజుల్లో ఒమన్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ఇన్‌కమింగ్ విమానాలను దారి మళ్లించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం రాత్రి 7:26 గంటలకు రాకపోకలను నిలిపివేసింది, రెండు గంటల తర్వాత పునఃప్రారంభించిన‌ట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫొటోలు వీడియోలు అక్క‌డి దుస్థితిని వివ‌రిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లు దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ రెండూ వరదలకు గురయ్యాయి కనీసం ఒక దుబాయ్ మెట్రో స్టేషన్‌లో నీరు మోకాళ్ల‌ లోతులో ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. దుబాయ్‌లో కుండపోత...
Exit mobile version