Indian Army | భారత సైన్యానికి మరో శక్తివంతమైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం
Indian Army | భారత సైన్యం తన డ్రోన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ యుద్ధాలలో విస్తృతంగా డ్రోన్‌ల (heavy duty drones) ను ఉపయోగిస్తున్నారు. దీంతో వీటి ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నాయి.
భారత సైన్యం ఇప్పుడు 1000 కి.మీ కంటే ఎక్కువ దూరం, 30,000 అడుగుల ఎత్తు, 24 గంటల కంటే ఎక్కువ ఎగరగల సామర్థ్యం కలిగిన డ్రోన్‌లను కోరుకుంటోంది. స్వదేశీ అభివృద్ధి, విదేశీ సహకారంపై దృష్టి సారిస్తున్నారు.
Indian Army : శక్తివంతమైన డ్రోన్‌లు ఎందుకు?
భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ వాతావరణం ఎదురైనా సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇది తన డ్రోన్ సామర్థ్యాలను పెంచుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ డ్రోన్‌లు శత్రువులను పర్యవేక్షించడంలో సమాచారాన్ని సేకరించడంలో అలాగే ఖచ్చితమైన దాడులు చేయడంలో సహాయపడతాయి. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య జర...