Tuesday, March 4Thank you for visiting

Tag: Double Bedroom House

Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana
Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ...

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

Telangana
Indiramma Housing Scheme Update : రాష్ట్ర ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కసరత్తు మొద‌లుపెట్టింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ‌ పార‌ద‌ర్శకంగా జ‌రిగేలా చ‌ర్య‌లు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులుచేర్పులు చేసిన త‌ర్వాత త్వరలోనే యాప్ ను విడుద‌ల చేయ‌నున్నారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఇండ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక అత్యంత‌ పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇళ్లు అందిస్తామ‌న్నారు. ల‌బ్దిదారుల ఎంపిక నిమిత్తం రూపొందించిన యాప్‌ను శ‌నివారం ఆయన స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో ప‌రిశీలించారు. అయితే ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార...

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Telangana
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...
Exit mobile version