Tuesday, March 4Thank you for visiting

Tag: Devendra Fadnavis

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

Trending News
Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు. శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. "లవ్ జిహాద్‌", బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా...

Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన

Elections
Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు "అడ్డంకి" కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో  అమిత్ షా  సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే "సానుకూలంగా" ఉన్నప్పటికీ  ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మ...

ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

National
ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి  గోవులకు ఉన్న పవిత్రత, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. , ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ ఆవులు మన రైతులకు ఒక వరం. కాబట్టి, మేము గోవులకు ఈ (Cow As Rajya Mata) హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గోశాలలో దేశవాళీ ఆవుల పెంపకం కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్...

BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు

National
BJP Offices | భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్తరించేందుకు అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజ‌పీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్ప‌టికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్ల‌డించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant) మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. బిజెపి దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. 563 పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని బిజేపి ప్రధాన కార్యాలయం పనాజీ శివార్లలో రాజధాని నగరాన్ని ఓల్డ్ గోవాకు కలిపే హైవేకి సమీపంలో ఉంటుంది. డిసెంబర్ 2026 నాటికి కొత...
Exit mobile version