dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..
Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు.
ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చాడని భావించారు. అయితే కవర్ లో దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, " నా దుకాణం చుట్టూ మురుగు నీరు నిలిచి ఉంది. అక్కడ విపరీతంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం వద్ద మాకు తీవ్రమైన దోమలు, విషకీటకాల సమస్య ఉంది అని వివరించాడు. "నన్ను నేను రక్షించుకోవడానికి దోమల సమస్యను పరిష్కరించడానికి, నేను కొన్ని దోమలను పాలిథిన్...