Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు
Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఓవర్ హెడ్ వైర్లు (OHE) 25 వేల వోల్ట్స్ (25 kV) విద్యుత్తుతో విజయవంతంగా పనిచేసేలా చేయబడ్డాయి. దీని ద్వారా రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సిద్ధమైంది.
ఈ మార్గంలో 4 కిలోమీటర్ల OHE సిస్టమ్‌ను విద్యుదీకరించారు.త్వరలో ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభం అవుతాయి. విద్యుత్ సరఫరా కోసం సారాయ్ కాలే ఖాన్‌లో ఒక ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్ ఉంది. ఇది 66kV విద్యుత్తును అందుకొని, రైళ్లకు 25kV, స్టేషన్ల అవసరాలకు 33kVగా పంపిస్తుంది.
సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ప్రత్యేకతలు:
ఈ స్టేషన్ 4 రైలు మార్గాలు, 6 ప్లాట్‌ఫారమ్‌లు కలిగి ఉంది.
5 ప్రవేశ/నిష్క్రమణ గేట్లు, 14 ఎలివేటర్లు, 18 ఎస్కలేటర్లు ఉన్నాయి.
స్టేషన్ పొడవు 215 మీటర్లు, వెడల్పు 50 మీటర...