Friday, May 9Welcome to Vandebhaarath

Tag: Delhi Water

National

Water Crisis | ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం, ట్యాంకర్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌పై పెనుగులాట

Water Crisis in Delhi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన‌ నీటి ఎద్దడి నెలకొంది. నీళ్ల కోసం స్థానికులు నీటి ట్యాంకర్లను వెంబడించడం.. ట్యాంక‌ర్ల వ‌ద్ద నీటి కోసం పెనుగులాట‌లు, కొట్లాట వంటి దృశ్యాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. ఢిల్లీలో నీటి కొర‌తకు సంబంధించి వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. నివాసితులు నీటి ట్యాంక‌ర్ల వెంట‌ వెనుక పరుగెత్తడం, అధికారులు పంపిన ట్యాంకర్‌లపై ఎక్క‌డం.. తమ బిందెలు, క్యాన్ల‌తో పొడవైన క్యూలలో వేచి ఉండ‌డం వంటివి ఈ వీడియోల్లో చూడ‌వ‌చ్చు. ఎండవేడిమిలో నీటి కోసం ప్రజలు అల్లాడుతుండడం చూసి అంద‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. #WATCH | Water supplied through tankers to Delhi locals in the Okhla area, amid water shortage in the national capital this summer pic.twitter.com/spAr9CGG2l — ANI (@ANI) June 16, 202...
Exit mobile version