Rajnath Singh | ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్..
Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని "క్లీన్"గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. బిజెపిలో వాషింగ్ మెషీన్ లేదని, ఎవరినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఏజెన్సీలకు చెప్పడం లేదని ఆయన అన్నారు. "వాషింగ్ మెషీన్ అంటూ ఏదీ లేదు, ఏజెన్సీలు తమ పనిని చేయాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఇతర పార్టీలను అరెస్టు చేయాలని మేము ఏజెన్సీలకు చెబుతున్నామంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. వారు తమ తప్పులను, అవినీతిని, బలహీనతలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా అవినీతి ఆరోపణల నుండి తప్పించుకోవచ్చని వారు భావిస్తే, వారు పొరబడినట్లేనని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ...