Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి బెంగళూరులో నీటి ఛార్జీలను సవరించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D.K Shivakumar) శుక్రవారం శాసన మండలిలో అన్నారు.బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు ఏడు నుంచి ఎనిమిది పైసల పెంపును ప్రతిపాదించింది. కానీ ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వం (Karnataka Government) లీటరుకు ఒక పైసా మాత్రమే పెంచాలని భావిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విషయంపై త్వరలో నగర ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందని శివకుమార్ తెలిపారు.
ఏటా రూ.1000 కోట్ల నష్టం
2014 నుండి నీటి ఛార్జీలు పెంచలేదని, దీనివల్ల BWSSB ఏటా రూ.1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని ఆయన అన్నారు.పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు BWSSB ...