Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..
Khel Ratna award | భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 సంవత్సరానికి నలుగురు క్రీడాకారులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. చదరంగం విభాగంలో డి.గుకేశ్ (D Gukesh ) , షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ను ఈ అవార్డులు వరించాయి.
2024-25 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Khel Ratna award ) జాబితాలో భారతదేశ డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌లను చేర్చినట్లు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జనవరి 2న గురువారం ధృవీకరించింది. మరోవైపు భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా-అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశ అత్యున్నత స్పోర్టింగ్ గౌరవానికి నామినేట్ అయ్యారు. జనవరి 17, శుక్...