Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..
Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Goutham Adani) పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్తలు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చాయి.
రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయన సహచరులపై అభియోగాలు మోపిన విషయంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. గౌతమ్ అదానీ.. భారత్, అమెరికన్ చట్ట...