Bengaluru | వేడి దోస సర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జరిమానా..
Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్రమైన ఆహారాన్ని అందించనందుకు ఈ చర్య తీసుకుంది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు రూ.7,000 చెల్లించాలని ఆదేశించింది.
బెంగుళూరులోని కోరమంగళకు చెందిన 56 ఏళ్ల తహారా, 2022 జూలై 30న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళ్తుండగా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెస్టారెంట్‌లో ఆగిపోయానని పేర్కొంది. వడ్డించిన ఆహారం చల్లగా ఉందని, తాజాగా లేదని ఆమె పేర్కొంది. ఆమె వేడి భోజనం కోరగా, రెస్టారెంట్ సిబ్బంది ఆమె అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో అధిక రక్తపోటుతో బాధపడుతున్న సదరు మహిళ రెస్టారెంట్‌లో తినలేనందున తాను సమయానికి మందులు తీసుకోలేకపోయిందని ఆరోపించారు.
ఫిర్యాదును స్వీకరించి వి...