Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం
Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు.
మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ లో ఓ పోస్టులో వివరాలు వెల్లడించారు. “చాలా విచారకరం! #మహాకుంభ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలచివేసింది. ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది. అందరి భద్రత కోసం మా గంగాదేవిని ప్రార్థిస్తున్నాం. మంటలు అదుపులో ఉన్నాయని, అవి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
Prayagraj Fire Accident : కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన యోగీ ప్రభుత్వం
తాత్కాలిక మహా కుంభ్ నగరం...