india maldives relations | మాల్దీవులకు షాక్.. భారీగా పడిపోయిన భారత పర్యాటకుల సంఖ్య..
న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా మాల్దీవులలో పర్యాటక జనాభాలో గణనీయమైన మార్పును చవిచూసింది. మాల్దీవ్స్ (Maldives) పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన డేటా ప్రకారం.. భారతీయ సందర్శకుల సంఖ్య మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. భారత్ , మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
అధికారిక మాల్దీవుల ప్రభుత్వ డేటా ప్రకారం , ఈ ద్వీపసమూహంలోకి పర్యాటకుల వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యా: 18,561 మంది (10.6% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 2)
ఇటలీ: 18,111 మంది (10.4% మార్కెట్ వాటా, 2023లో 6వ స్థానం)
చైనా: 16,529 మంది (9.5% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 3)
UK: 14,588 మంది (8.4% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 4)
భారతదేశం: 13,989 మంది (8.0% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 1)
జర్మనీ: 10,652 మంది (6.1% మార్కెట్ వాటా)
USA: 6,299 మంది (3.6% మార్కెట్ వాటా, ...