Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్
లక్నో: సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల నుంచి సేకరించిన అండాలు విక్రయిస్తున్నారు. (Minor Girls Eggs Selling) నిరుపేద కుటుంబాలలోని బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.. మరోవైపు బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి 11,500 రూపాయలు మాత్రమే చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది.కాగా, వారణాసి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వారణాసి నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె...