Friday, March 14Thank you for visiting

Tag: Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

తాజా వార్తలు
Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు క...

Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి

Crime
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందార‌ని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిద‌శ‌ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమ‌వుతున్న క్ర‌మంలోనే ఇంత‌టి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే బస్తర్‌ రీజియన్‌లో వ‌రుస ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృ...

ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..

Special Stories
ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. ఆ ఊరికి వెళ్తే అడుగడుగునా యూట్యూబర్లే కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తులసి అనే గ్రామం యూట్యూబర్లకు ప్రసిద్ధి చెందింది. 10వేల జనాభా గల ఈ గ్రామంలో ప్రతీ వీధిలో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు. రాయ్‌పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ తులసి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1100 మంది యూట్యూబర్‌లు ఉన్నారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుకుగా ఉంటున్నారు. అయితే యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యువతను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తులసి గ్రామంలో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహకంగా జిల్లా యంత్రాంగం ఆధునిక పరికరాలతో  కూడిన...

హైవోల్టేజ్ డ్రామా: ప్రియుడితో గొడవ పడి 80 అడుగుల విద్యుత్ టవర్ ఎక్కిన యువతి

Trending News
  ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓయువతి తన ప్రియుడితో తలెత్తిన గొడవ కారణంగా కలత చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ఏకంగా 80 అడుగుల హైవో్ల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ ను ఎక్కింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమెను రక్షించేందుకు ప్రియుడు కూడా టవర్ ఎక్కడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కొంతమంది స్థానికులు టవర్ పైన వీరిద్దరిని గమనించి వెంటనే పెండ్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు  డా సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి టవర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్తులు గుమిగూడారు. పోలీసు అధికారులు ఆ జంటతో చాలాసేపు చర్చలు జరిపి, వారిని కిందికి దిగేలా ఒప్పించారు. గంటల తరబడి పోలీసులు చేసిన ప్రయత్నాలు  ఎట్టకేలకు సఫలమయ్యాయి. అక్కడ గుం...
Exit mobile version