Automobile | ఓలాకు షాక్ .. భారీగా తగ్గిన ఈవీ స్కూటర్ల అమ్మకాలు
Electric vehicles Insustry | EV మార్కెట్ 'కింగ్' OLA ELECTRIC మార్కెట్ వాటా తగ్గింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపెనీ మార్కెట్ వాటా 47 శాతం ఉండగా ఇప్పుడు 28 శాతానికి పడిపోయింది. అయితే, ఇదే సమయంలో ఇతర EV కంపెనీల మార్కెట్ వాటా పెరిగింది. అంతే కాదు ఆ కంపెనీల స్కూటర్లను కూడా ప్రజలు ఎక్కువగా క్రేజ్ పెంచుకుంటున్నట్లు తాజా గణంకాలను బట్టి స్పష్టమవుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు ఇప్పుడు పడిపోవడం ప్రారంభించాయి. జూలై నుంచి కంపెనీ విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్ సేల్స్) ప్రత్యక్ష పోటీ పెరిగింది. దీని కారణంగా కంపెనీ నష్టాలను ఎదుర్కొంటోంది. సెప్టెంబరు అమ్మకాల గణాంకాలను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపె...