Tuesday, March 4Thank you for visiting

Tag: chennai

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

Trending News
High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గిస్తాయి. హైదరాబద్ నుంచి ప్రయాణీకులు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోగలరు . High Speed Rail : విమానాల కంటే వేగంగానా? ప్రస్తుతం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుండగా, చెన్నై అంతర్జాతీయ విమాన...

Sitaram Yechury | చెన్నైలో జన్మించి.. హైదరాబాద్ లో ఎదిగి.. ఢిల్లీలో విద్యాభ్యాసం.. సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే..!

తాజా వార్తలు
Sitaram Yechury :  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయ‌న‌ కన్నుమూశారు. ఆయన ఆర్థిక, సామాజికవేత్తగా, కాలమిస్ట్‌గా ఏచూరికి ఎంతో గుర్తింపు ఉంది. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగుతున్నారు. సీతారాం ఏచూరి చెన్నై లో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సోమేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్‌ రోడ్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేసేవారు. తల్లి కల్పకం సైతం ప్రభుత్వ అధికారిగా ప‌నిచేశారు. దీంతో ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది. హైద‌రాబాద్‌ ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసిన అనంతరం దిల్లీకి వెళ్లారు. అక్క‌డ ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌ స్కూల్‌లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ఆల్‌ ఇండియా టాప్ ర...

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

National
New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు: మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

National
water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ముంబై: పెరుగుతున్న నీటి డిమాండ్, అస్థిరమైన వర్షపాతం, తగ్గుతున్న నీటి వనరులతో, నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేగవంతమైన పట్టణీకరణ, సరిపడని మౌలిక సదుపాయాలు,  అసమర్థమైన నీటి నిర్వహణ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు తగ్గిపోవడం..  ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరత కారణంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BM...

IPL 2024 : ఐపీఎల్ ఫీవర్.. చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లు

Sports
CSK Vs RCB IPL 2024 Match 1 | చెన్నైలోని చెపాక్‌లోని MA చిదంబరం స్టేడియంలో 2024 టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ ఐపిఎల్ 2024 సీజన్‌ను మార్చి 22న MA చిదంబరం స్టేడియంలో శుక్ర‌వారం రాత్రి 8 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధంగా ఉంది . ఈ మ్యాచ్ ల‌ను తిల‌కించేందుకు ప్యాసింజర్ స్పెషల్స్ రైలు 2024 మార్చి 22, 26వ‌ తేదీల్లో వేలచ్చేరి-చింతాద్రిపేట్-వేలాచ్చేరి మధ్య నడుస్తుంది. రైల్వే ప్రకారం, మొత్తం నాలుగు రైళ్లలో నడుస్తాయి. రెండు వేలాచ్చేరి నుండి, మిగిలిన రెండు చింతాద్రిపేట నుండి న‌డ‌వ‌నున్నాయి. చెన్నై మెట్రో సమయాల పొడిగింపు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) IPL 2024 క్రికెట్ మ్యాచ్ కారణంగా మెట్రో రైళ్ల స‌మ‌యాల‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. CMRCL ప్రయాణాన్ని సులభతరం చేయడాన...

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

Andhrapradesh, Crime
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదా...

పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

Crime
చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ...

నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు

Crime
తమిళనాడులో దారుణం చెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్‌ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని అంబత్తూరులోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కమేష్ (25)గా గుర్తించారు. ఆటోరిక్షా అతని స్నేహితుడిది. ఈ దాడిలో కమేష్ సోదరుడు సతీష్ (29) కూడా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గత గురువారం రాత్రి కామేష్‌ తన సోదరుడిని అంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇంటిలో దింపేందుకు ఒరగడమ్‌కు వెళ్తున్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్‌ల...
Exit mobile version