చంద్రయాన్–3 సక్సెస్.. జాబిలమ్మపై సేఫ్గా ల్యాండ్ అయిన విక్రమ్
Chandrayaan-3 Live : అంతరిక్షంపై ఇండియా సంచలనం సృష్టించింది. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది. ఒక్కో దశ దాటుకుంటూ ల్యాండర్ విక్రమ్ చందమామను చేరుకుంటుంటే బెంగళూరు ఇస్రో కేంద్రంలో చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్నాయి. అది చూసిన జనాల మోముల్లోనూ అమితానందం వెల్లివిరిసింది. చంద్రయాన్3 సేఫ్గా ల్యాండింగ్ కావడంతో అందరూ హమ్మయ్య.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చం ద్రయాన్ -3 ప్రాజెక్టు దిగ్విజయమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించింది. జాబిలి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యింది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ నిర్ణీత సమయానికి చంద్రుడిని చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు టెన్షన్ కు గురయ్యా...