Dera Baba | డేరా బాబాకు సుప్రీం నోటీసులు.. హత్య కేసు నేపథ్యంలో జారీ
Dera Baba : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim) తోపాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. 2002లో జరిగిన ఓ హత్య కేసులో వీరు నిర్దోషులని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం (Supreme Court) ఈ మేరకు స్పందించింది. రామ్ రహీమ్ సింగ్‌తోపాటు నలుగురిని సమాధానాలు కోరుతూ నోటీసులు జారీ చేసింది.
అత్యంత వివాదాస్పద కేసు
డేరా సచ్చా సౌదా (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై 2002లో నమోదైన హత్య కేసు చర్చనీయాంశమైంది. అత్యంత వివాదాస్పద కేసుల్లో ఇదొకటి. ఇది డేరా సచ్చా సౌదా సంఘానికి చెందిన మాజీ మేనేజర్ రంజీత్ సింగ్ హత్యకు సంబంధించింది. డేరా సంస్థలో రంజీత్ సింగ్ కీలక పాత్ర పోషించే వారు. డేరాలో ఉన్న అవకతవకలపై ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారని, ఈ క్రమంలోన...