Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పాడి పరిశ్రమ, ఎరువుల ఉత్పాదనకు రూ.16,000 కోట్లు
Union Cabinet Decisions : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు (Union Cabinet Decisions ) తీసుకుంది. వ్యవసాయ సంబంధిత రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు (మార్చి 19) ఆమోదం తెలిపింది. మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vishnaw) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద క్యాబినెట్ రూ.3,400 కోట్లను ఆమోదించిందని చెప్పారు. మరోవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మార్కెట్ లింకేజీలను పెంచేందుకు, దేశవ్యాప్తంగా పాడి రైతులకు మద...