Friday, May 9Welcome to Vandebhaarath

Tag: Bus Accident

Crime

విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు. ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిని విచారిస్తున్నామని, కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.  " వాహనాలు ఢీకొన్న ప్రభావం చాలా బలంగా ఉంది, కారు తలుపులను  కత్తిర...
Exit mobile version