Cow Milk vs Buffalo Milk | ఆవు పాలు, గేదె పాలలో ఆరోగ్యానికి ఏది బెస్ట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Cow Milk vs Buffalo Milk | ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఆహారాలలో పాలు అతి ప్రధానమైనది. ఇవి పోషకాల గనిగా చెబుతారు. అనే వంటకాలలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండి ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలు.. మొత్తం శారీరక ఆరోగ్యానికి మేలుచేస్తాయి. మెరుగైన ఎముక సాంద్రత, రోగనిరోధక శక్తి పెంపొందించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది.అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలల్లో ప్రపంచ దేశాల్లో ఆవు పాలు, గేదె పాలను అత్యంత విరివిగా సేవిస్తుండగా, విదేశాల్లో ఆవు పాలను ఎక్కువగా వినియోగిస్తారు, తేలికపాటి రుచికి, సులభమైన జీర్ణక్రియకు ఆవుపాలు పేరుగాంచింది. ఇది సాధారణంగా పానీయాలు, వంటలు, జున్ను, పెరుగు, వెన్న వంటి పలు రకాల పాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. మరోవైపు, గేదె పాలు ముఖ్యంగా దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలు, ఇటలీలో ప్రసిద్ధి చె...