రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..
Lava O2 | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా O2, బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. యునిసోక్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్-సి యుఎస్‌బి కేబుల్‌తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ 13, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల కోసం 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది.
ఫోన్ గురించి మాట్లాడుతూ.. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ మాట్లాడుతూ, “వినియోగదారుల డిమాండ్లు నిరంతరం మారుతూనే ఉన్నాయి, ముఖ్యంగా తమ స్మార్ట్‌ఫోన్‌ల స్టైల్, ఫంక్షనాలిటీ రెండింటిలో రాజీ లేకుండా.. Lava O2 సరికొత్త గ్లాస్ బ్యాక్ డిజైన్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాం. ఆండ్రాయిడ్ 14కి గ్యారెంటీ అప్‌గ్రేడ్‌తో పాటు 2 సంవత్సరా...