Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు
Budget 2024 - Andhrapradesh | బడ్జెట్ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి కూడా సాయమందిస్తామని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించిందని...