TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?
TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా కులగణన (TG Caste Census ) చేసి తీరాలంటూ తన ప్రసంగాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజయవంతంగా పూర్తిచేశామని ఉదహరించారు. కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్నట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ తెరపై కి వచ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేయవచ్చు.
టికెట్ల విషయంలో తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని బీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్...