Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం
Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నగరంలోని ఐటీ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీని ఈ రైల్వే లైన్ కలుపుతుంది. చివరకు మే 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం సతీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డికె.శివకుమార్ మాట్లాడుతూ, "మే 2025 నాటికి ఎల్లో లైన్ ప్రజా సేవ కోసం ప్రారంభిచంనున్నామని అన్నారు. 2025-26 పూర్తి కోసం పింక్ లైన్ కూడా ట్రాక్‌లో ఉంది.పింక్ లైన్ (కాలేన అగ్రహార నుంచి నాగవార వరకు 21.2 కి.మీ) కు సంబంధించిన వివరాలను డికె శివకుమార్ పేర్కొన్నారు.
7.5 కి.మీ ఎలివేటెడ్ సెక్షన్ (కలేన అగ్రహార నుంచి తవరేకెరె/స్...