Sunday, March 9Thank you for visiting

Tag: BJP Govt

Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి

Trending News
Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును స్వయంగా మార్చుకున్నారు. గతంలో 6 తుగ్లక్ లేన్ అని రాసిన తన ఇంటి బోర్డును ఆయన 6 వివేకానంద మార్గ్ (Vivekananda Marg) గా మార్చారు. దినేష్ శర్మకు 6, తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ నివాసం కేటాయించారు. ఇక్కడ, అతను తన కుటుంబంతో కలిసి తన నివాసంలో గృహ ప్రవేశ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుగ్లక్ లైన్ నుంచి స్వామి వివేకానంద మార్గ్ గా. ఎంపి అధికారిక నివాసం నేమ్ ప్లేట్ పై 'స్వామి వివేకానంద మార్గ్' అని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ గురువారం (మార్చి 6) పూజాకార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్లారు...

One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?

Special Stories
One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ప‌లు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం త‌ర‌చూ ఏదో ఒక‌చోట‌ ఎన్నికల‌ను నిర్వ‌హించాల్సివ‌స్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది . 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఎందుకు? పెద్ద ఎత్తున డ‌బ్బులు ఆదా.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ...

Kanwar Yatra | కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

Trending News
Kanwar Yatra eateries row : కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల షాపుల‌ యజమానుల పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం (జూలై 22) మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. 'వెజ్ లేదా నాన్ వెజ్' ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణ యజమానులను కోర్టు ఆదేశించింది. Kanwar Yatra : న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానాలు కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లను ప్ర‌ద‌ర్శించాల‌ని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి సుప్రీంకోర్టు ఖరారు చేసింద...
Exit mobile version