Friday, March 14Thank you for visiting

Tag: Bihar’s Bhagalpur

Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు

Viral
పాట్నా: బీహాల్ (Bihar) లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసు వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ వాహనాన్ని కొంత దూరం వరకు తోయించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆ నలుగురిని పోలీస్‌ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇంతలో పోలీస్‌ వాహనంలో ఇంధనం అయిపోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు.. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నిందితులు పోలీసు వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం తోసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. ఈ వీడియ...
Exit mobile version