Friday, March 14Thank you for visiting

Tag: Bihar politics

Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్‌..

National
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ 130 మంది శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. JD(U), RJD, కాంగ్రెస్ ఫ్రంట్ అయిన మహాఘటబంధన్ (మహాకూటమి) నుండి నితిష్‌ కుమార్ BJP నేతృత్వంలోని NDA కూటమిలోకి చేరిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో సోమ‌వారం అవిశ్వాస ప‌రీక్ష‌లో నితిష్ గెలిచారు. ఈ సెషన్‌లో ముగ్గురు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ ఎన్డీఏలోకి మారారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తాను తీసుకొచ్చిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, 15 ఏళ్లుగా లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. 2005లో తాను అధికారంలోకి వచ్చినప్...

Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు

National
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం 9వ సారి ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను ఉన్న చోటికి తిరిగి వచ్చానని చెప్పారు. 2020లో, రాష్ట్రంలో JD(U)-NDA కూటమి అధికారంలోకి వచ్చింది. 2022లో కూటమి నుంచి వైదొలిగి జేడీ(యూ)-ఆర్జేడీ (RJD) మహాఘటబంధన్‌కు సీఎం అయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లిపోయారు. "నేను ఇంతకు ముందు (ఎన్‌డిఎలో) ఉన్న చోటికి ఇప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళే ప్రశ్నే లేదు" అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. Bihar Political Crisis : లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ‍ కూటమిని నుంచి దూరంగా ఉండటంఆర్జేడీకి పెద్ద దెబ్బ. దీనిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పందిస్తూ.. బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు. జెడి(యు) 2024లో ముగుస్తుందని, నితీష్‌ కుమార్‌ను 'అలసిపోయిన ముఖ్యమంత్రి' అని తేజస్వి విమర్శించారు. నితీష్‌ కుమార్‌...

Bihar Politics LIVE Updates : Bihar | సీఎం ప‌ద‌వికి నితీశ్ రాజీనామా.. జేడీయూతో కలవాలని బీజేపీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం

National
  Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వరకు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో ఎవ‌రికి ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన స‌భ్యుల సంఖ్య జేడీయూ వ‌ద్ద ఉన్నదా? అనే అంశాల‌ను ప‌రిశీలిద్దాం. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.. ఆర్జేడీ పార్టీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.. మ‌రో వైపు 78 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవ‌లం 45 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ...
Exit mobile version