Prajapalana Application | ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం.. అప్లై చేసుకునే విధానం ఇదే..
ప్రజాపాలన' దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లో 'ప్రజాపాలన'(Prajapalana) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీల కోసం ప్రజల వద్దకే వెళ్లి దరఖా స్తులు స్వీకరిస్తున్నామని, అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు విధానం ఇదే..
Prajapalana Application Process : 'ప్రజాపాలన' దరఖాస్తు పత్రాన్ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిం ది. ఇందులో 4 పేజీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అర్హులు ప్రతీ పథ...