Thursday, March 13Thank you for visiting

Tag: Bharatpur

బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి, 12 మందికి గాయాలు

Crime
భరత్పూర్:రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాతీయ రహదారిపై బస్సును ట్రక్కు ఢీకొనడంతో  11 మంది మరణించారు.  12 మంది గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జిపై నుంచి బస్సు బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది.. బస్సు డ్రైవర్ తోపాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో. ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని దిహోర్‌కు చెందినవారు....
Exit mobile version