Wednesday, March 5Thank you for visiting

Tag: Benjamin Netanyahu

Israel | హిజ్బుల్లాకు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని ఇజ్రాయెల్ ..

World
Israel | లెబనాన్‌లో ఇరాన్-మద్దతు గల హిజ్బుల్లాపై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఈ మిలిటెంట్ గ్రూపునకు చెందిన‌ కమాండ్ సెంటర్‌లు, ఆయుధాల నిల్వ‌లు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేప‌డుతోంది. ఈ పేలుళ్లు దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాలను రెండు గంటలకు ప్ర‌భావితం చేశాయి. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన బాంబు దాడి ఆదివారం వరకు కొనసాగింది. బీరుట్‌లోని షియాలు అధికంగా ఉండే శివారు ప్రాంతమైన దహియేహ్‌లోని నివాసితులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైనిక హెచ్చరికల నేపథ్యంలో బీరుట్, దాని శివార్లలో బలమైన పేలుళ్లు సంభవించాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలతో సహా బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కనీసం ఎనిమిది దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులను లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ "చాలా హింసాత్మకంగా" అభివర్ణించింది. ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌లో తన భూ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది...

UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?

World
Middle East crisis | ఇరాన్‌ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ( UN chief Antonio Guterres ) ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈమేరకు తమపై ఇరాన్‌ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించలేదని ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకారం, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడిని, అక్టోబర్ 7న హమాస్ దాడులను ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించ‌లేదని ఆరోపించారు. అందుకే ఆయ‌ను దేశంలోకి రాకుండా నిషేధించించిన‌ట్లు వెల్ల‌డించారు... ఈ చర్యలను ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదని కాట్జ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ మద్దతు ఉన్నా లేకున్నా తమ‌ దేశ‌ పౌరుల...

Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

World
Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ టెల్ అవీవ్, జెరూసలేం ల‌పై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్య‌లో మిసైల్స్ ఆకాశం నుంచి న‌గ‌ర‌గాల‌పై ప‌డుతుండ‌గా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌ (ISRAEL ) పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు దాని మిత్రదేశాల మధ్య దీర్ఘకాలిక యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ తన క్షిపణి దాడి ప్రారంభించ‌డంతో ఇజ్రాయెల్ వెంట‌నే త‌మ‌ నగరాల్లో సైరన్‌లు మోగించింది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, ఇజ్రా...

Israel-Iran Tension Row : కొత్త యుద్ధం ప్రారంభమైందా? ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై 100కు పైగా క్షిపణుల దాడి?

World
Israel–Hezbollah Conflict : ఇరాన్ నుంచి మంగళవారం (అక్టోబర్ 1, 2024) రాత్రి ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది, అయితే అంతకుముందు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్ర‌ధాన‌ నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురికి తీవ్రంగా గాయాల‌యిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.. మంగళవారం సాయంత్రం అమెరికా దీని గురించి ముందుగానే హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా అధికారులు అలెర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు సంకేతాలు అందాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు 'AFP'కి తెలిపారు. ఈ దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మ...
Exit mobile version