Tuesday, March 4Thank you for visiting

Tag: Bengaluru news

MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌

National
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. సెంట్రల్‌ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోప...

Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..

National
Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుండ‌గా మ‌రో వివాదం అక్క‌డి హ‌స్తం పార్టీకి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్‌ పార్క్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు ఏకంగా 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం దుమారం రేపుతున్న‌ది. ఖర్గే కుమారుడు రాహుల్‌ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) భూ కేటాయించ‌డం అధికార దుర్వినియోగమని, కర్ణాటక ప్ర‌భుత్వం బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వీయ ఎక్స్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వివాదంపై మ‌ల్లికార్జున‌ ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధా...

Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

Trending News
Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగ‌దారుల క‌మిష‌న్ జ‌రిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్ర‌మైన‌ ఆహారాన్ని అందించనందుకు ఈ చ‌ర్య తీసుకుంది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు రూ.7,000 చెల్లించాలని ఆదేశించింది. బెంగుళూరులోని కోరమంగళకు చెందిన 56 ఏళ్ల తహారా, 2022 జూలై 30న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళ్తుండగా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెస్టారెంట్‌లో ఆగిపోయానని పేర్కొంది. వడ్డించిన ఆహారం చల్లగా ఉందని, తాజాగా లేదని ఆమె పేర్కొంది. ఆమె వేడి భోజనం కోరగా, రెస్టారెంట్ సిబ్బంది ఆమె అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న స‌ద‌రు మ‌హిళ రెస్టారెంట్‌లో తినలేనందున తాను స‌మ‌యానికి మందులు తీసుకోలేకపోయిందని ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించి వి...

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

Telangana
South central Railway | వేస‌విలో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మధ్య రైల్వే ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లోప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం వాసుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపించ‌నుంది. ఈ విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరు వెళ్లే రైలు ఏప్రిల్‌ 24, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉండ‌నుంది. అలాగే బెంగ‌ళూరు నుంచి విశాఖ‌ప‌ట్నం స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తీ ఆదివారం ఏప్రిల్ 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో అందుబాటో ఉంటుంది. ఈ రైలు దువ్వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, క‌ట్పాడి, జొలార్‌ప‌టాయి, క్రిష్ణార్జున‌పురం రైల్వేస్టేష‌న్ల‌లో హాల్టింగ్ సౌక‌ర్యంక‌ల్పించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌ల...

Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామ‌న్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు..!

Elections
Election code | బెంగళూరు :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్‌ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్‌ చేసి శివకుమార్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌ శనివారం తన సోదరుడు డీకే సురేష్‌ తరఫున బెంగళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. డీకే సురేష్‌ బెంగళూరు రూరల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న త‌రుపున‌ ప్ర‌చారం చేస్తూ శివకుమార్ మాట్లాడారు. తన సోదరుడు సురేష్‌ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగు నీటిని త‌ర‌లించి నగర ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. అయితే డీకే శివకుమార్‌ ఇచ్చిన ఈ హామీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఓటు వేస్తే నీళ్లు ఇస్తామని చెప్పడం ఓటర్లను ప్...

Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..

Viral
Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత "చాలా మురికిగా" ఉన్నాయని భావించారు. తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వ‌స్తువులు త‌నిఖీ చేస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. X లో షేర్ చేసిన వీడియోలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న మరో ప్ర‌యాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు. వీడియోలో, ఆ వ్యక్తి కన్నడలో “రైతు మెట్రో రైలు టిక్కెట్ కలిగి ఉన్నాడు. అతని బ్యాగ్‌లో బట్టలు...
Exit mobile version