Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..
Kisan Credit Card Details: బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పోలిస్తే, కిసాన్ క్రెడిట్ కార్డులు (KCC) కాస్త భిన్నవైనవి. కేవలం రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం, రైతులకు అవసరమైన షార్ట్ టర్మ్ రుణాల కోసం, 1998లో నాబార్డ్ (NABARD) ఈ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ లు, కోపరేటివ్ బ్యాంక్ లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు అందిస్తాయి.
ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు.. కాబట్టి ఆ కార్డులను PM కిసాన్ క్రెడిట్ కార్డ్ లు అని కూడా పిలుస్తారు.
కేసీసీల్లో కొంత రుణ పరిమితి (KCC Credit Limit) ఉంటుంది. ఆ మొత్తంతోనే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం పాటు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, కిసాన్ క్రెడిట్ కార్డ్ తో కేవలం పావలా వడ్డీతో...