Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..
Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లన్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖకు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే తాజా నిర్ణయం తీసుకుంది.
అదనపు కోచ్‌లు జతచేసిన రైళ్ల జాబితా..
17421/17422 తిరుపతి కొల్లాం ఎక్స్‌ప్రెస్
12703/12704 హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
15634/15633 గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్
15631/15632 గౌహతి బార్మర్ ఎక్స్‌ప్రెస్
15630/15629 సిల్‌ఘాట్ టౌన్ తాంబరం నాగావ్ ఎక్స్‌ప్రెస్
15647/15648 గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
15651/15652 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్
15653...