Beer Price Hike : బీర్ ధరలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ?
Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్ ఛార్జీలు, తాగునీటి చార్జీలు, మెట్రో ఛార్జీలను సైతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు.
ప్రస్తుతం బీరు మినహా మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని, బీరు ధరల పెంపుపై ఆలోచిస్తున్నామని, అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidha Ramaiah) తో చర్చించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. “మేము ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి, బీరు ధరను పెంచాలని ప్రతిపాదిస్తే, అది ఒక నిర్ధారణకు వచ్చే వరకు చర్చ దశలోనే ఉంటుంది, మేము దీన...