Friday, March 14Thank you for visiting

Tag: Baramati

రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో ‘శుభ ముహూర్తం’ ఫిక్స్ చేసుకున్న దొంగలు

Trending News
చివరకు పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితులు మహారాష్ట్రలోని బారామతిలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కొందరు దొంగలు ఓ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అది కూడా శుభ మహూర్తంలో చేయాలనుకునున్నారు. ఈ క్రమంలో ఆ దొంగల బృందం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి అతడికి ఫీజుగా రూ.8 లక్షలు చెల్లించింది. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పెంపించివేశారు. వారి వద్ద నుంచి రూ.76లక్షల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్ నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీ కార్మికులు" అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ గ...
Exit mobile version