Bahraich : బహ్రైచ్ హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్..?
Bahraich violence | బహ్రైచ్‌లోని జిల్లా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) అధికారులు శుక్రవారం బహ్రైచ్‌లో హింసను ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది ఇళ్లపై నోటీసులు అతికించారు. మూడు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
నివేదికల ప్రకారం.. 24 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా హత్యకు కారణమై హింసాకాండకు పాల్పడిన ఐదుగురిలో ఒకరైన అబ్దుల్ హమీద్‌తో సహా 23 మందిపై బుల్డోజర్ చర్యను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన జిల్లా రహదారిపై శాఖ అనుమతి లేకుండా రహదారి మధ్య సెంటర్ పాయింట్ నుంచి 60 అడుగుల దూరం లోపు ఏదైనా నిర్మాణ పనులు చేస్తే అది అక్రమ నిర్మాణాల కేటగిరీ కిందకు వస్తుందని అధికారులు తెలిపారు.
“బహ్రైచ్ (Bahraich ) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో లే...